బ్రైన్ కెమేరా!......           (28-Jul-2020)


 గుర్తుకొస్తున్నాయి – 5

కాలేజీ కబుర్లు

 

బ్రైన్ కెమేరా!..

 

1978 లో మేము చేసిన ఢిల్లీ, కాశ్మీర్ యాత్రలో ముఖ్యమైన సరదా మిత్రుడు ‘హాషిం’ తెచ్చిన కెమేరా!

 

అప్పటి వరకూ, మేం దిగినవన్నీ బ్లాక్ & వైట్ ఫోటోలే! ఆ యాత్రలో మాత్రం హాషిం తెచ్చిన Yashica Electro 35 కెమేరాతో రంగుల ఫోటోలు దిగాం. కాలం గడిచే కొద్దీ fade అయిపోయాయి. కానీ అప్పట్లో ఆ ఫోటోలు చూసుకొంటూ ధ్రిల్ అయ్యేవాళ్ళం.

 

ఇంకో విశేషం ఏమంటే అది కొంత ఆటోమేటిక్. నాకు బాగా గుర్తు లేదు కానీ కొన్ని adjustments మనం చెయ్యనక్కరలేదు. అందుకే దీన్ని Brain Camera అని సరదాగా పిలుచుకొనేవాళ్లం.

 

ఆ తరువాతి రోజుల్లో T.B. రామకృష్ణ Yashica 635 కెమేరాతో ఫోటోలు తీసేవాడు. ఆ కెమేరా అంటే తనకెంతో ఇష్టం.

 

ఇప్పుడైతే మొబైల్ లో Click III కెమేరాలలో క్లిక్ చేసినట్లే చేసేస్తున్నాం కానీ, Yashica Electro 35 కెమేరా ఆ టూర్ లో మాకు పెద్ద లగ్జరీ.

 

- డి.ఆర్.కె
28.07.2020.