PIC రాం.. NIC దాస్....           (09-Aug-2020)


 గుర్తుకొస్తున్నాయి... 17

కాలేజీ కబుర్లు

PIC రాం.. NIC దాస్

(Picnic రాందాస్)

            ఫస్టియర్ లో అమరావతి పిక్ నిక్ కు వెళ్లి బాగా enjoy చేశాం కదా! రాందాసుకు తానూ ఒక picnic organize చేయాలనే పట్టుదల వచ్చింది. క్లాస్ మేట్స్ ను నాగార్జునసాగర్ తీసుకువెళ్లడానికి సిద్ధం అయ్యాడు.

            వెళ్లడానికి ఎవ్వరికీ పెద్ద ఆసక్తి లేదు. కానీ హాస్టల్ లో ఒక్కొక్కళ్ళ గదికి వచ్చి వస్తాం అనే దాకా వదలలేదు. మొహమాటానికి కొంతమంది వస్తాంలే అన్నారు. లేడీస్ రాకుండా ఏం బావుంటుంది, మేం రాం అని కొందరు భీష్మించారు.

            ‘ఆ బాధ్యత నాది కదాఅని మొత్తానికి బస్సుకు సరిపడా జనాన్ని కూడేశాడు. లేడీస్ ఇంటికి వెళ్ళి వారి తల్లి తండ్రులతో మాట్లాడి కొంతమందిని తీసుకువచ్చాడు.

            దూరంగా చూడగానే అమ్మో! రాందాసు అనుకునే రోజులవి. ఈ పరిస్థితి అంతా చాలా హృద్యంగా రకరకాల సినిమా పాటలతో కూర్చిన ‘PIC రాం.. NIC దాస్ అనే వ్యంగ్య రూపకాన్ని రూపొందించాడు టీబీ రామకృష్ణ. ఆ కాలంలో రేడియోలో సినిమా పాటలతో కూడిన కథలు చెప్పే కార్యక్రమాలు వచ్చేవి. హాస్టల్ రూమ్ నెంబర్ 111 లో ముందుగా మా అందరికీ ప్రదర్శించి చూపించాడు. అప్పుడే టీబీ లో ఉన్న క్రియేటివ్ టాలెంట్ మా అందరికీ తెలిసింది.

            ఈ రూపకాన్ని నాగార్జునసాగర్ లో ప్రదర్శించాడు టీబీ. PDP రావు చేతులతోనూ, స్పూన్లతోనూ మ్యూజిక్ వేశాడు.

            రాందాసు కూడా enjoy చేశాడు.

            రాందాసు కోసమే వెళ్లినా సాగర్ టూర్ ను బాగా ఎంజాయ్  చేశాం.

            అందుకే నేను టీబీ ని తన గుర్తులను ఇంకా ఇంకా రాయమనేది.

            జూలు విదుల్చు టీబీ.

- డి.ఆర్.కె.

 09.08.2020