స్వచ్ఛ చల్లపల్లి కబుర్లు....           (16-Nov-2022)


 గుర్తుకొస్తున్నాయి...53

స్వచ్ఛ చల్లపల్లి కబుర్లు

---

2015 నవంబర్ మొదటి వారంలో ఒక రోజు ఉదయం.

OP లో పేషెంట్స్ ను చూస్తున్నాను.

బుద్ధ ప్రసాదు గారి నుండి ఫోన్ వచ్చింది.

సర్ నమస్తే!”,

నమస్కారం డాక్టరు గారు. నేను బెంగుళూరు లో ఉన్నాను. వెంకయ్య నాయుడు గారు మీతో మాట్లాడతారటఅని ఫోను వారికిచ్చారు.

డాక్టరు గారు You are doing an excellent job. Congratulations to your team!” అన్నారు.

ఆనాడు వారు పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారు.

ఒక కేంద్ర మంత్రి స్వచ్ఛ భారత్ లో భాగమైన స్వచ్చ చల్లపల్లిఉద్యమాన్ని ప్రశంసిస్తూ సరాసరి ఫోను చేయడం చాలా సంతోషంగా అనిపించింది.

'సర్! ప్రధానమంత్రి గారు చల్లపల్లి చూడాలని మా కార్యకర్తల కోరిక'.. అని అడిగాను.

'That is next to impossible' అన్నారాయన.

అలా అయితే మా మొదటి వార్షికోత్సవానికి మీరు రండి సర్ అన్నాను'.

"తప్పకుండా వస్తాను. ఎప్పుడు మీ వార్షికోత్సవం?"

'నవంబర్ 12 సర్'.

'ఆరోజు రాలేను. రెండు, మూడు రోజులు అటూ ఇటూగా వస్తాను . Date మళ్లీ మీకు కబురు చేస్తాను'.

ఇది మా ఇద్దరికీ ఫోన్ లో జరిగిన సంభాషణ.

ఆ తరువాత నవంబరు 15 వ తేదీన వస్తానని కబురు చేశారు.

ఆరోజు వస్తానన్న సమయానికంటే ఆయన 15 నిముషాలు ముందే వచ్చి అందర్నీ ఆశ్చర్యపెట్టారు.

గతంలో అధ్వాన్నంగా ఉండే మా స్మశానాన్ని స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు సుందరంగా తయారుచేశారు.

ఆ స్మశానంలోనే వారికి ఆహ్వానం పలకడం,

ప్రశంసలనందుకోవడం,

వారిని పుర వీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లడం,

పింగళి వెంకయ్య గారి విగ్రహావిష్కరణ,

NTR పార్కును సందర్శించడం,

Z.P.హైస్కూలులో జరిగిన బ్రహ్మాండమైన బహిరంగ సభ

-చల్లపల్లి వాసులం ఎప్పటికీ మర్చిపోలేం.

-----

ఈరోజు బ్రహ్మం గారు ఆనాటి ఆంధ్రజ్యోతి రాసిన వివరాలను పోస్ట్ చేసిన తరువాత గుర్తుకొచ్చిన మధురమైన జ్ఞాపకాలు.

- దాసరి రామకృష్ణ ప్రసాదు

16.11.2022