2049* వ రోజు...
సూర్యోదయ – అస్తమానాలంత ఖచ్చితంగా ఈ నాటి వేకువ 4.00 కే స్వచ్చ సైనికుల గ్రామ – రహదారుల బాధ్యత మొదలైపోయింది! 6.05 కు ముగిసింది. ఈ దినం స్వచ్చ విధులలో పాల్గొన్న 39 మంది కార్యకర్తల మీద ఎవరి ఒత్తిడీ లేదు – ఏ ప్రలోభమూ కాదు – తాము ఎంతో కొంత ఋణపడ్డామని భావించే వీరు సమాజ బాధ్యతల పట్ల స్వయం ప్రేరితులు! 2049 ...
READMORE
2048* వ రోజు...
ఈ శనివార శుభోదయాన – 4.04-6.05 మధ్య సమయాన అక్షరాలా 39 మంది వివిధ నేపద్యాల- గ్రామాల నిస్వార్థ శ్రమదాన ప్రమోదస్వాభావికులు శివరామపుర గ్రామ పరిసరంలో సాధించిన పెదకదళీపురమార్గ స్వచ్చ – శుభ్ర - సుందరీకరణలు చూచి తీరవలసినవి, మెచ్చదగినవి - అనుసరించదగినవి! శివరామపుర కార్యకర్తలంటే ఈ పని చేయడం ...
READMORE
2047*వ రోజు...
నేటి వేకువ శ్రమదాన వేదిక ఐన శివరామపురం పంట కాలువ వంతెన దగ్గరలో- నిర్ణీత ముహూర్తమైన 4.04 కాలానికి చేరుకొన్న రెండు గ్రామాల స్వచ్చ కార్యకర్తలు నిర్ణీత ముగింపు సమయ నియమాన్ని మాత్రం ఉల్లంఘించి-6.30 వరకు అక్కడి అవసరం మేర- తమ తనివి తీర ఐచ్చిక శ్రమదానం ముగించారు. ఉభయ గ్రామాల నుండి కార్యకర్తల సంఖ్య సైతం పెరిగింది. శివరామపురం నుండి 9 మంది...
READMORE
2046* వ రోజు...
పాతికవేల మంది పైగా జనాభా ఉన్న చల్లపల్లి నుండి, సమీప కొత్త శివరామపురం నుండి కేవలం 25 మంది స్వచ్చ కంకణధారులైన – తాము బ్రతుకుతున్న గ్రామ సమాజాల మెరుగుదల కోసం కర్తవ్య పరాయణులైన కార్యకర్తలు 3 కిలోమీటర్లని డివికల – గత 6 రోజుల నుండి శుభ్ర సుందరీకరణ ప్రయత్నం చేస్తున్న పెదకళ్లేపల్లి మార్గంలో – 7 ...
READMORE
2045*వ రోజు...
ఈనాటి చల్లని వేకువలో కూడ 27 మంది రెండు గ్రామాలకు చెందిన స్వచ్చ కార్యకర్తలు (చల్లపల్లి, శివరామపురం) 4.03 కే సంసిద్ధులైపోయి, 6.05 నిముషాల దాక కొనసాగించిన రహదారి ఆకృతి మెరుగుదల కృషితో 7 వ నంబరు పంట కాలువ దగ్గరి పూరిళ్ళ సమీపం ఎంతగా శుభ్ర – సుందరమై పోయిందంటే – అటుగా తిరుగాడే ప్రయాణికులు...
READMORE
2044* వ రోజు...
ఈ రోజు వేకువ జామున- 4.02-6.00 మధ్య- తమ గ్రామ స్వచ్చ శుభ్రతల బాధ్యతలు భుజాల మీది కెత్తుకొన్న 22 మంది స్వచ్చ చల్లపల్లి కార్యకర్తలు స్థిమితంగాను, అంకితంగాను, పెదకళ్లేపల్లి మార్గంలోని 7 వ నంబరు పంట కాలువ సమీపాన రహదారి శుభ్రతా చర్యలు నిర్వహించారు. ఇంచు మించు నిన్నటి చోటనే- కత్తుల సాన క...
READMORE
2043* వ రోజు...
ఈ వేకువ సైతం 4.00 - 6.00 నడిమి 2 గంటల పాటు తమ సామాజిక బాధ్యతను విస్మరించని చల్లపల్లి, శివరామపురం కార్యకర్తలు 24 మంది శివరామపురం బాటలో – నిన్నటి తమ స్వచ్చ – శుభ్రతా ప్రయత్నాలను మరికొంత పొడిగించారు. దారికి కుడి ఎడమలలో – కత్తుల సాన కొలిమి షెడ్డు మొదలుకొని, పంట కాలువ దగ్గరి పూరి గుడి...
READMORE