2087* వ రోజు...
నేటి (20.12.2020) వేకువ 4.28 కే ఉత్సాహభరితంగా మొదలైన శ్మశాన పరిశుభ్ర – సుందరీకరణకు ఉపక్రమించిన చల్లపల్లి స్వచ్చోద్యమకారులు (కొద్ది మంది ట్రస్టు కార్మికులతో సహా) 49 మంది. మరి వీరి ఉల్లాస పూరిత స్వచ్చతా వ్యవసాయంతో పునీతమైన జాగాలు నిన్నటి తరువాయిగా మిగిలిన దారులు, చిల్లలవాగు గట్టు, చెత్త కేంద్ర పరిసరాలు, దహన వాటికల చుట్టు ప్రక్కలు, మరికొంత ఖాళీ ప్రదేశము.
...
READMORE
2086* వ రోజు...
మంచు, చలి ముందుకు వచ్చిన ఈ శనివారం (19.12.2020) నాటి బ్రహ్మ ముహూర్తంలో – 4.29 సమయంలో 16 మంది, మరి కొద్ది నిముషాల వ్యవధిలో మిగిలిన కార్యకర్తలు ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని చిల్లల వాగు గట్టు మీద గల శ్మశాన వాటిక దగ్గరకు చేరుకొని, ఆరితేరిన పారిశుద్ధ్య కార్మికుల్లాగా – కత్తులు, గొర్రులు, పారలు, పలుగులు, చీపుళ్ళ వంటి ఆయుధధారులై 6.12 దాక చేసిన ‘స్వచ్చంద శ్రమదానంతో స్వచ్చ – సుందర – సమగ్ర చల్లపల్లి’ సార్ధకమయింది.
...
READMORE
2085* వ రోజు...
యధావిధిగా ఈ బుధవారం (16.12.2020) నాటి ఉషోదయారంభంలో – 4.20 నుండి 6.05 వరకు చల్లపల్లి స్వచ్చోద్యమ కారుల, ఉద్యమ కారిణుల స్వగ్రామ బాధ్యతలు నిరాఘాటంగా జరిగిపోయినవి. నేటి సేవల రంగస్థలం – ఊరి 3 రోడ్ల ప్రధాన కూడలి మొదలు అవనిగడ్డ దిశగా ప్రభుత్వ రవాణా బస్సు కేంద్రం దాక! ఐచ్ఛికంగా, అనివార్యంగా పాల్గొన్న స్వచ్చ సైనికులు 25 మంది.
...
READMORE
2084* వ రోజు...
సుదీర్ఘ స్వచ్చోద్యమ చల్లపల్లి లో 2084* వ నాడు.
ఈ ఆదివారం (13.12.2020) నాటి స్వచ్చంద శ్రమదాన సందడిలో భాగస్వాములైన కర్మవీరులు 32 మంది. చల్లపల్లి గ్రామంలో వీరి ఆదర్శ కృషి కి నోచుకొన్న ప్రదేశం- మూడు ప్రధాన దారుల కూడలి నుండి విజయవాడ మార్గంలో ని కస్తూరి మామ్మ రహదారి వనం వరకు.
...
READMORE
2083* వ నాడు...
27 మంది స్వచ్చతా బాధ్యుల పారిశుధ్య చర్యలతో మరింతగా ముస్తాబైన గ్రామ ప్రముఖ వీధులు 3. గత బుధవారం తరువాయిగా – అదే చోట – ప్రధాన కూడలిలోనే 4.29 కే గుమికూడిన 27 మంది స్వచ్చోద్యమ కారులు 5.42 సమయం దాక నిర్వహించిన విధులతో ఇంచుమించుగా ఆ బుధవారం చేసిన బందరు, అవనిగడ్డ, ...
READMORE