3496* వ రోజు ... ...
వేకువ ఝామున 4:13 ని.లకు 10 మందితో ప్రారంభమయిన స్వచ్ఛ సేవ ముగింపు సమయానికి 25 మందితో కళకళలాడింది. ప్రత్యేక దళ సభ్యులు 6 గురు కాసానగర్ చెక్ పోస్ట్ దగ్గరలో హైవేకు దిగువన గతంలో నాటిన నీడనిచ్చే మొక్కల వరుసలో మరిన్ని మొక్కలు నాటుటకు అనువుగా గుంటలు తీయటం కన్పించింది. ముగింపు సమయానికి 12 మొక్కలు పెట్టుటకు గాను గోతులు తీశారు. రేపు మరిన్ని మొక్కలు నాటుటకు ఆ ప్రాంతాన్ని ముస్తాబు చేస్తారు.
హైవే...
READMORE
3495* వ రోజు ... ...
తెల్లవారు ఝామున 4:16 ని॥లకు వేకువ సేవ 10 మందితో ప్రారంభమయింది. హైవే లో శివరామపురం దగ్గరగా రహదారికి దిగువున ఎడమ ప్రక్కగా కలుపు మొక్కలను పీకుతూ, మొక్కల మొదళ్ళలోని చెత్తను వేరుచేస్తూ, మొక్కలకు పాదులు చేస్తూ ప్రత్యేక దళ సభ్యులు 6 గురు శ్రమిస్తుండగా వారికి సహాయంగా గొర్రులతో చెత్తను పోగు పెడుతూ కొందరు, డిప్పలకెత్తి ట్రాక్టర్ లో చెత్తను లోడ్ చేస్తూ మరికొందరు ఇష్టంగా కష్టపడడం కనిపించింది.
వారికి ...
READMORE
3494* వ రోజు ... ...
వేకువ జాము 4:16 ని॥లకు హైవే రోడ్ లోని కొత్తూరు రోడ్ జంక్షన్ కు అతి సమీపంలో 13 మందితో ప్రారంభమయిన శ్రమయజ్ఞం నిర్విరామంగా కొనసాగింది. మొక్కలకు దిగువ భాగంలో అనగా నీడనిచ్చు మొక్కలకు చుట్టూ ఉన్న మాచర్ల కంప, పిచ్చి దొండ తీగలను తొలగించి మొక్కలకు గాలి తగిలి స్వేచ్చగా పెరగడానికి వీలుగా చేయడం జరిగింది.
కొద్ది మం...
READMORE
3493* వ రోజు ... ...
వేకువనే 4:16 ని॥లకు 216 జాతీయ రహదారికి ఒక ప్రక్కన జరుగుతున్న సేవ 17 మందితో ప్రారంభమయింది. మొక్కల చుట్టూ పరిశుభ్రం చేయడం, పిచ్చి గడ్డి, కలుపును తొలగించడం మొక్కల మొదళ్లకు మట్టిని పోసి సరిచెయ్యడం లాంటి పనులు జరుగుతూ ఉన్నాయి.
ఈలోపుగా ఒక్కొక్కరు చేరుకుని గొర్రులతో లాగడం, చెత్తను ప్రోగు బెట్టడం చేస్తుండగా అనుకున్న సమయానికి ఒకింత ముం...
READMORE
3492* వ రోజు ... ...
6.6.2025 వ తేది 3492 * వ రోజు శ్రమైక జీవన సౌందర్యం!
తెల్లవారు జామున 4:15 ని॥ 12 మందితో ప్రారంభమైన స్వచ్ఛ సేవలు హైవే రోడ్డుకు ఉత్తరం వైపు సువర్ణ గన్నేరు మొక్కల మధ్యన ఉన్న మాచర్ల కంప, గడ్డిని కొందరు తొలగించారు. క్రింది భాగంలో పెద్ద మొక్కల చుట్టూ ఉన్న కలుపును ఏరివేస్తూ, వంగి పోయిన మొక్కలకు కర్రలు పాతి, సరిజేసి పాదులు చేయటం జరిగింది....
READMORE