3216* వ రోజు . ...
మంగళవారం నాటి (27.08.2024) అట్టి శ్రమకు వేకువ 4.17 కే అంకురార్పణ జరిగింది. NH 216 మీది గంగులవారిపాలెం క్రాస్ రోడ్డుకు దగ్గరగా 6.08 నిముషాలకు (ముగ్గురు మాత్రం మరో 6-7 నిముషాలకు) ముగిసింది. చల్లపల్లి గ్రామ స్వచ్చ - సుందరోద్యమ శ్రమదాన కథ ఈ ఒక్కనాటిదా? అది వేలాది శ్రమదినాల చాంతాడువ నిడివిదీ, తరచి చూస్తే వందల కార్యకర్తల - 4 లక్షల పని గంటల లోతైనదీ!
ఈ పూ...
READMORE
3215* వ రోజు . ...
అనగా అది 26-8-24 - సోమవారం! ఎంత స్వచ్చీకరించినా పూర్తి తృప్తి దక్కక మళ్ళీ అదే 216 వ రహదారి 22-23 కిలోమీటర్ రాళ్ళ నడుమనే 4.20 కాకుండానే పనికి వంగిన కారకర్తల బృందం! వాతావరణం హాయిగా అనిపించినా సందేహాస్పదంగానే వర్షాగమనం!
ఏ గంగులవారిపాలెం సమీపంలో నెలల తరబడీ – వేల పనిగంటల కొద్దీ హరిత శుభ్ర – సుందరీకరణంజరుగుతున్నదో ఆ గ్రామ విభాగం...
READMORE
3214* వ రోజు ....
NH216 హరిత సుందరీకరణలోనే 3214* వనాడు!
అసలే ఆదివారం - ఆహ్లాదకర వాతావరణం – జాతీయ రహదారిలో 22 వ కిలో మీటరుకు దగ్గరగా, ఇరువంకలా ఇప్పటికే పుష్పించిన సువర్ణ గన్నేరు, గద్దగోరు వంటి రంగుల పూలమయం - ఇక, అక్కడ 4.18 కే ఉద్యుక్తమైన స్వచ్ఛ కార్యకర్తల గణం - అది క్రమ క్రమంగా 38 సంఖ్యకు చేరిన వైనం!...
READMORE
3213* వ రోజు ....
3213* వ శ్రమాద్భుతం!
ఈ శనివారమొక్కటనేం కాదు - చల్లపల్లిలో ప్రతి వేకువా తమ ఊరి కోసం కొందరి కష్టం ఏ రోజైనా సమాలోచనీయమే - సమాదరణీయమే! మాలాంటి కొందరి కది పవిత్రమే!...
READMORE
3212* వ రోజు . ...
ఇది శుక్రవారం – 23.8.24 వేకువ సమయానిది! ఒకరకంగా 29 మంది చల్లపల్లి గ్రామీణులది! ఇక వారిలో 86 ఏళ్ల వృద్ధ వైద్యుడు మొదలుకొని, గ్రామ సర్పంచి కృష్ణకుమారి, పాలనాధికారి మాధవేంద్రరావు - ఇలా విశిష్ట వ్యక్తుల సమ్మేళన మది!
పదే...
READMORE